
హుజురాబాద్ మోటార్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు..
పయనించే సూర్యుడు // జనవరి 29//హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ //కుమార్ యాదవ్
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మోటారు వాహనాల తనిఖీ అధికారి కంచి వేణు అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మహోత్సవం సందర్భంగా జమ్మికుంట లారీ అసోసియేషన్ లో ఓనర్స్ మరియు డ్రైవర్స్ కు అవగాహన కల్పించారు. డ్రైవింగ్‌లో నైపుణ్యం సరిగా లేకపోవడం, రోడ్డు భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం, అవగాహన లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి.డ్రైవింగ్ లైసెన్స లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు.వాహనము మలుపు తిరుగుతున్నప్పుడు నిలుపు ఉన్నప్పుడు చేతితో సరైన సంకేతాలు ఇవ్వాలి. ముందు వెళ్లే వాహన డ్రైవరు గారి ఇవ్వనిచో వాహనము దాటుటకు ప్రయత్నించకండి. కదులుతున్న వానని ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదు. రాత్రి సమయంలో ఎదురుగా వాహనములు వచ్చినప్పుడు హెడ్లైట్ డిమ్ చేయాలి. ఇరుకు వంతెన వద్ద ట్రాఫిక్ ను గమనించి సహనముతో దాటాలి. క్షేమంగా చేరుటకు ఏకైక మార్గం. తడిగా ఉన్న ఆయిల్ ఉన్న ఇసుక దుమ్ము బురద రోడ్డుపై వేగంగా వెళ్ళుట ప్రమాదకరం. రోడ్డు నిబంధనలు సూచనలకు డ్రైవర్లకే కాదు కుండా పాదాచారుల కూడా వర్తింపచేస్తాయి. పాదాచార్యులు రోడ్డుకు ఇరువైపులా చూసి వాహనము రానప్పుడు జీబ్రా లైన్లో వద్దనే రోడ్డును దాటాలి. నిర్ధారిత స్థలంలో మాత్రమే వాహనాన్ని పార్కింగ్ చెయ్యాలి.మార్గం రాత్రి వేళలో వాహనాన్ని నిలిపించినప్పుడు పార్కింగ్ లేటు తప్పనిసరిగా వెయ్యాలి.ఇన్సూరెన్స్ రెన్యువల్, ట్యాక్స్, పొ ల్యూషన్ రికార్డులన్నీ బస్సులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.రోడ్డు నిబంధనలు పాటించాలని తెలిపారు.మద్యం తాగి, నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దన్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. .వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు, కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. కాబట్టి వాహనం నడిపేట ప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచిం చారు.ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డ్ గుర్రం శ్రీకాంత్ గౌడ్, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.