
హాజరైన అన్ని పార్టీ వర్గాలు.
పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 13: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి: రామ్మూర్తి. ఎ.వాజేడు: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక మండల మరియు జిల్లా పరిషత్ ఎన్నికల జరిగే విషయంలో ముందస్తు చర్యలలో భాగంగా నేడు ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విజయ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొత్త పోలింగ్ బూత్ లు నిర్వహించాలని ప్రజలకు అందుబాటులో పోలింగ్ కేంద్రాలను నిర్వహించాలని కోరారు. అంతేకాకుండా నూతనంగా మురుమూరు పంచాయతీలో మరియు ఎడిజర్ల పల్లి పంచాయతీలో అలాగే టేకులగూడెం పంచాయతీలో పోలింగ్ కేంద్రాలు మార్పులు చేర్పులు చేయాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వాజేడు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొల్లె డేనార్జున్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూనెం రాంబాబు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు, గౌరారపు సర్వేశ్ రావు ములుగు జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ కార్యదర్శి చిచ్చడి రాఘవులు మరియు బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పెనుమల్ల కృష్ణారెడ్డి, బిజెపి మండల మాజీ అధ్యక్షుడు రామ్ కిషోర్, సిపిఎం మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి మరియు మండల అన్ని పార్టీ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.