
ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి.
మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడపరాదు.
కార్ డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి.
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం.
ఆటోలో పరిమితికి మించి జనాన్ని ఎక్కించకూడదు, ఎక్కించిన యెడల కేసులు నమోదు చేస్తాం
ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు వాహనాలను నడపాలి-బాపట్ల టౌన్ సీఐ ఆర్. రాంబాబు
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 10:- రిపోర్టర్ (కే.శివ కృష్ణ) ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆటో డ్రైవర్లు ఆటోలలో పరిమితికి మించి జనాన్ని ఎక్కించవద్దని బాపట్ల టౌన్ సీఐ ఆర్. రాంబాబు హెచ్చరించారు. ఆదివారం బాపట్ల పాత బస్టాండ్ వెంకటేశ్వర స్వామి గుడి సమీపం వద్ద హెల్మెంట్ లేని ద్విచక్ర వాహనాలను ఆపి కేసులు నమోదు చేశారు. అలాగే ఆటోలో పరిమితికి మించి జనాన్ని ఎక్కించరాదని అలా ఎక్కించిన యెడల కేసులు నమోదు చేస్తామని వారిని బాపట్ల టౌన్ సీఐ ఆర్. రాంబాబు హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని వాహనదారులను ఆయన కోరారు. ద్విచక్ర వాహనదారులు వాహనానికి సంబంధించి సరైన పత్రాలను కలిగి ఉండాలని, లేనిపక్షంలో వాహనాలను సీజ్ చేయటం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వలన తలకు బలమైన గాయాలయి తగిలే ప్రమాదం ఉంటుందని, దానివలన ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించాలని ఆయన వాహనదారులను కోరారు. కార్ డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఆయన తెలిపారు. అలాగే త్రిబుల్ రైడింగ్ చేయరాదని, వాహనాలను శబ్దాలు చేస్తూ తిరగకూడదని బాపట్ల టౌన్ సీఐ ఆర్. రాంబాబు హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అలా ఇచ్చిన ఎడల వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని బాపట్ల టౌన్ సీఐ ఆర్. రాంబాబురూరల్ ఎస అన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపకూడదని ఆయన అన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని ఆయన ద్విచక్ర వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సీఐ ఆర్. రాంబాబు హెచ్చరించారు.