
న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో అమరజవాన్లకు నివాళులు.
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్) షాద్ నగర్ టౌన్/మున్సిపాలిటీ:విద్యార్థులు సమాజసేవలో పాల్గొనాలని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్ అహ్మద్ ఖాన్( బ్రూస్ లీ )కోరారు.2019 ఫిబ్రవరి 14న పుల్వామా ప్రాంతంలో దేశంకోసం ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ సైనికులకు శుక్రవారం పట్టణంలోని సత్యనారాయణ దేవాలయం వద్ద విద్యార్థులతో కలిసి అమరజవాన్లకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,,,ఫిబ్రవరి 14న పుల్వామా అనే ఊరిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు మరణించారని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు దేశానికి రక్షణగా ఉంటూ సేవ చేస్తున్న ఆర్మీ సైనికులను గుర్తు పెట్టుకోని కచ్చితంగా నివాళులు అర్పించడమే కాకుండా,మన బాధ్యతగా గుర్తించాలని సూచించారు.అప్పుడప్పుడు ఇలాంటి వాటిని గుర్తుంచుకుంటూ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,కోచ్,తదితరులు పాల్గొన్నారు..