
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 8 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్ నగర్ మండలం బూర్గుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు విద్యార్థులే ఉపాధ్యాయులయి తమ యొక్క కొత్త అనుభవాలను తమ తోటి విద్యార్థులను వివరించడం జరిగింది విద్యార్థులు వివిధ సబ్జెక్టులతో పాటు తమకు ఇష్టమైన అంశాల గురించి తమ తోటి విద్యార్థులకు వివరించడం అనంతరం జరిగిన కార్యక్రమాల్లో విద్యార్థులు తమ యొక్క అనుభవాలను పంచుకోవడం జరిగింది అనంతరం పాఠశాల హెడ్మాస్టర్ రవికుమార్ కొత్తగా ఉపాధ్యాయులైన విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు