
పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 18:- రిపోర్టర్( కే శివకృష్ణ )… యుగపురుషుడు,విశ్వ విఖ్యాత నటసార్వభౌమ,పద్మశ్రీ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బాపట్ల పట్టణ ఏరియా వైద్యశాలలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు 29వ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను.ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం. అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందారు, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది.’సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు’ అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది… నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది…స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త…స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనతో… “అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం” అని నిరూపించిన మాననీయులు ఎన్టీఆర్ ఆశించిన సమసమాజాన్ని సాధించుకుందాం. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని…తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణబద్ధులై ఉన్నామని తెలుపుతూ.. కోట్లాది హృదయాల్లో కొలువైన నందమూరి తారక రామారావు గారే నాకు నిత్యస్ఫూర్తి. తన నటన కౌశల్యంతో తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్ దే . నటుడిగా తనని ఆదరించిన ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ని స్థాపించి రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా కేవలం 8 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో సంస్కరణలు చేపట్టారు. మహిళాలకు ఆస్తిలో సగం వాటా హక్కు కల్పించి వారికి ఆర్థిక సామాజిక గౌరవం కల్పించి మహిళ సంక్షేమం కొరకు విశేష కృషి చేసారు. 2 రూ.లకే కిలో బియ్యం, రేషన్ వ్యవస్థ ను ప్రవేశపెట్టి పేదప్రజల గుండెల్లో దేవుడై నందమూరి తారక రామారావు నిలిచారు అని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు,టిడీపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ,పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు,మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, రాష్ట్ర తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎంపిపి మానం విజేత,తోట నారాయణ,మాజీ పట్టణ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వరరావు, పల్లం సరోజిని మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.