
—-హ్యూమన్ రైట్స్ సొసైటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తంబర్ల నరసింహారావు.
పయనించే సూర్యుడు జనవరి 29 రిపోర్టర్ యూసఫ్ )జూలూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న 64 గ్రామాలలో మిర్చి కోత సీజన్ కావడంతో వలస కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూలి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వెంగన్నపాలెం మెయిన్ సెంటర్ కు వచ్చి నిత్యవసర సరుకులు కొనుగోలు చేస్తున్నారు ఇదే అదునుగా చూసుకొని కొందరు వ్యాపారులు అత్యధిక ధరలకు నిత్యవసర వస్తువులను విక్రయిస్తున్నారు కావున వెంగన్నపాలెం మెయిన్ సెంటర్లో వారాంతపు సంత ఏర్పాటు చేస్తే వలస కూలీలకే కాకుండా మండల ప్రజలకు కూడా నిత్యవసర సరుకులు సరసమైన ధరకు అందుతాయి అని వారన్నారు కనుక తక్షణమే వెంగన్నపాలెం మెయిన్ సెంటర్లో వారాంతపు సంతను ఏర్పాటు చేసి, వలస కూలీలతో పాటుగా మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఉపయోగకరంగా ఉండి సరసమైన ధరలకు వచ్చే విధంగా తమరు కృషి చేయగలరు అంటూ బుధవారం జూలూరుపాడు ఎంపీడీవో డి కరుణాకర్ రెడ్డి కి మెమరాండం అందించటం జరిగినదని వారు తెలిపారు.