
పయనించే సూర్యుడు న్యూస్( ఫిబ్రవరి.3/02/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్పిచ్చటూరు మండలం వేలూరులో నూతనంగా నిర్మించిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయ కుంభాభిషేక పూజల్లో ఎమ్మెల్యే కోనేటిఆదిమూలం సోమవారం ఉదయం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే , భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు, గ్రామ పెద్దలు ఆలయ మర్యాదలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి మాజీ చైర్మన్ డీ ఇళంగోవన్ రెడ్డి, జడ్పిటిసి మాజీ సభ్యులు సుమాంజలి, తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరత్నం నాయుడు, జయచంద్ర నాయుడు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.