బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మదినాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి
పార్టీలకతీతంగా బంజారా లందరూ పాల్గొనాలి
లంబాడి హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ పిలుపు
( పయనించే సూర్యుడు జనవరి 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్)
బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజైన ఫిబ్రవరి 15వ తేదీన ప్రభుత్వం అధికారకంగా జయంతి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించి, ఆరోజు ను సెలవుదినంగా ప్రకటించాలని లంబాడి హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బంజారా నాయకులు, బంజారా ప్రజలు, బంజారా మహిళలు పార్టీలకతీతంగా పాల్గొని శనివారం రోజున షాద్ నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా నిర్వహించనున్న నిరసన దీక్ష కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు.