
పయనించే సూర్యుడు కౌతాళం రిపోర్టర్ వంశీ
కౌతాలం మండలం ఉరుకుంద లో వెలిసిన
పవిత్రమైన శ్రీ శ్రీ ఉరుకుంద వీరన్న స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరగింది. ఈ వేడుకలో మంత్రాలయం ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవాలయ అభివృద్ధికి తమ మద్దతును ప్రకటిస్తూ,భక్తులందరికీ ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు.ఈ మహోత్సవం భక్తుల హృదయాలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించిందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ సహకారం నిరంతరం ఉంటుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రెడ్డి వారి సతీమణి యశోద , రఘునాథ్ రెడ్డి వారి సతీమణి చంద్రిక , రామకృష్ణ రెడ్డి వారి సతీమణి భారతమ్మ , రాకేష్ రెడ్డి , చూడి ఉలిగయ్య తనయులు నరేష్ గారు,LLC చైర్మన్ టిప్పుసుల్తాన్ ,అడివప్ప గౌడ్ ,వెంకటపతి రాజు , చిన్న గారు,dr. రాజానందన్ , చిరంజీవి, మహాదేవ నాయుడు, గట్టూరి ఈరన్న మరియు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.