శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో అన్యమత వివాహం.. కలకలం!

September 17, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 17( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం ఉదయం క్రైస్తవ మతస్థుల వివాహ కార్యక్రమం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆలయ కల్యాణ మండపంలో వివాహం జరుగుతున్న విషయాన్ని గుర్తించిన భక్తులు పాలకమండలి చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డికి సమాచారం అందించారు.వివాహ నిర్వాహకులను చైర్మన్ ప్రశ్నించగా, గత పాలకమండలిలోని ఓ సభ్యుడి సిఫారసుతో ఈవో అనుమతి ఇచ్చినట్లు వారు తెలిపినట్లు సమాచారం. హిందూ దేవాలయ ప్రాంగణంలో అన్యమత వివాహానికి అనుమతి ఎలా ఇచ్చారనే అంశంపై భక్తులు ప్రశ్నలు లేవనెత్తారు. ఆలయ నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఇచ్చారా? అన్న దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఈ ఘటనపై ఆలయ ఈవో వెంటనే వివరణ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ కల్యాణ మండపాన్ని ఇతర మతాల వివాహ కార్యక్రమాలకు వినియోగించేందుకు నిబంధనలు ఏమిటో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పాలకమండలి కూడా స్పందించి పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయాలని భక్తులు కోరుతున్నారు.

🌐 Select Language:
📰 ePaper