
పయనించే సూర్యుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కుత్బుల్లాపూర్ జనసేన పార్టీ ఇంచార్జ్ నందగిరి సతీష్ ఆహ్వానం మేరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ జగద్గిరిగుట్ట పై వేంచేసియున్న శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ఇష్ట దైవమైన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామివారి 54వ వార్షిక బ్రహ్మోత్సవం మరియు స్వామి వారి తిరు కళ్యాణోత్సవమునకు ముఖ్యఅతిథులుగా కూకట్ పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సాగర్ పాల్గొని శ్రీ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవముని తిలకించి ప్రత్యేక పూజలలొ పాల్గొన్నారు.
ఈ పూజా కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మరియు కూకట్పల్లి జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు