
పయనించే సూర్యుడు జనవరి 18 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)… శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం బూదిలి గ్రామ పంచాయతీ నందు శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఆకస్మికoగా తనిఖీ చేయడం జరిగినది. బూదిలి గ్రామ పంచాయతీ బూదిలి గ్రామం నందు నిర్మించిన క్యాటిల్ షెడ్ పనిని తనిఖీ చేశారు. క్యాటిల్ షెడ్ ను నిర్మించుకున్న లబ్దిదారుడు జి.శ్రీరాములు తో ముఖాముఖి మాట్లాడటం జరిగినది. క్యాటిల్ షెడ్ వలన ఎలాంటి ఉపయోగం ఉంది లబ్ది దారులకు ప్రయోజన కరంగా ఉంటుందా లేదా అని లబ్ది దారునితో కలెక్టర్ అడగడం జరిగినది. రైతు చాలా ఉపయోగకరంగా ఉన్నది అని తెలియచేయడం జరిగినది.ఈ కార్యక్రమం లో శ్రీ సత్య సాయి జిల్లా పథక సంచాలకులు కె. విజయ ప్రసాద్ , డ్వామా సిబ్బంధి గోవర్ధన్, హరి, అదనపు కార్యక్రమ అధికారి వరప్రసాద్, ఉపాధి సిబ్బంధి, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది.