
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 15 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయం సేవాలాల్ మహారాజును స్ఫూర్తిగా తీసుకొని బంజారాలను ముందుకు సాగాలి బంజారాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది సంత్ సేవాలాల్ మహరాజ్ ఆదర్శప్రాయుడని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతిని పురస్కరించుకొని శనివారం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రమ్య గ్రౌండ్స్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వ హించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం హిందూధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారని, సేవాలాల్ మహరాజ్ జయంతి పురస్కరించుకుని ఫిబ్రవరి 15న సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 2024లో ప్రకటించిందని గుర్తు చేశారు. సమస్త జీవకోటికి మాతృరూపం తల్లిగా వెలిసిన అమ్మభవాని గురించి అమ్మను పూజించాలని, కాని ఫలితం ఆశించవద్దని బంజారా లకు బోధించారని, సంత్ సేవాలాల్ మహరాజ్, హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శ మూర్తిగా నిలిచారన్నారు. సేవాలాల్ మహరాజ్ ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు. ఆ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారని,. ఆ క్రమంలో బ్రిటిష్, ముస్లీం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యిందన్నారు. ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మార్గంలో నడిపించేంందుకు సేవాలాల్ మహారాజ్ అవతరించారు. సేవాలాల్ మహరాజ్ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు బి సంజీవరావు, మేకల మైకల్, రేష్మ, ఏం సి మెంబర్ పనింద్ర, గిరిజన సంఘ నాయకులు రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ నాయక్, ధర్మ నాయక్, జిల్లా నాయకులు చిరంజీవి, శివ నాయక్, భాష, శివ, శ్రీను, రాజు ముదిరాజ్, శ్రీధర్ చారి, రామకృష్ణారెడ్డి, నితిన్ గౌడ్, నజీర్ బాయ్, అక్బర్ బాయ్, గిరి నాయుడు, గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.