
పయనించే సూర్యుడు, ప్రతినిధి (శ్రీరామ్ నవీన్) తొర్రూరు డివిజన్ కేంద్రం మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు డివిజన్, కేంద్రంలోని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు, ఈనెల 22న పాలకుర్తి నియోజకవర్గం నందు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , మరియు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఈ డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దవంగార మండల అధ్యక్షులు ముద్దాసాని సురేష్, పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్, పాలకుర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు హరీష్, తొర్రూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, దేవరుప్పుల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న, రాయపర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కల్యాణ్, కోడకండ్ల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యాకేష్, పెద్దవంగర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు హరికృష్ణ, తొర్రూరు టౌన్ అధ్యక్షులు మహేష్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.