పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1(గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ:
శ్రీ సరస్వతీ విద్యాపీఠం ద్వారా నడపబడుతున్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ వేములవాడ లో ఈరోజు ఆర్.బి. ఎస్ .కే (రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం)లో భాగంగా ప్రభుత్వ వైద్య బృందం చే హెల్త్ స్క్రీనింగ్ చేయడం జరిగింది.ఇందులో భాగంగా 1 నుండి 10 వ తరగతి విద్యార్ధులందరికీ హెల్త్ చెకప్ చేయడం జరిగింది.అలాగే AMB (Anemia Mukth Bharath ) కార్యక్రమం క్రింద 5,6,7వ తరగతుల విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్ష చేయడం జరిగింది.ఆ తర్వాత విద్యార్థులకు వైద్యాధికారులు డాక్టర్ ప్రభాకర్ గారు మరియు డాక్టర్ అభినయ రాణి గార్లు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం గురించి, ఆడపిల్లలకు ఐరన్ ఫుడ్ ప్రాధాన్యత గురించి అవగాహన చేయడం జరిగింది. అనంతరం పాఠశాల కమిటీ మరియు ఆచార్యుల బృందం వైద్యాధికారులకు చిరు సత్కారం చేసి తమ కృతజ్ఞతలు వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ మనోహర్ ,వైద్యాధికారులు డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ అభినయ రాణి మరియు ఫార్మాసిస్ట్ సంధ్య రాణి,ఎ ఎన్ ఎమ్ దివ్య,ఆశా వర్కర్ మంజుల మరియు పాఠశాల ఆచార్యులు మాతాజీలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని ప్రధానాచార్యులు చిలుక గట్టు తెలిపారు.
సరస్వతీ శిశు మందిర్ లో హెల్త్ స్క్రీనింగ్
RELATED ARTICLES