

పయనించే సూర్యుడు న్యూస్ చివ్వెంల మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి18… సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని గాయంవారిగూడ,దూరజ్ పల్లి,రెవెన్యూ గ్రామాలలో రైతు భరోసా పథకం సాగుకు యోగ్యం కాని భూములను వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల స్పెషల్ ఆఫీసర్ జగదీష్ రెడ్డి అధికారులు సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ సర్వే నెంబర్ ప్రకారం సాగు చేయని భూములను గుర్తించాలన్నారు ప్రభుత్వం చేపట్టిన పథకాలు లబ్ధిదారులకు చేరు లాగా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణయ్య,మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు గిర్దావారి శ్రావణి వ్యవసాయ విస్తరణ అధికారులు శైలజ, సాహస్ సర్వేయర్ శ్యామ్,మరియు టీమ్ మెంబర్లు పాల్గొన్నారు.