జనవరి 17 పయనించే సూర్యుడు బచ్చన్నపేట జనగామ జిల్లా.
మండలంలోని బండ నాగారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసింది తమ ప్రభుత్వం అని తెలిపారు.అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు అప్పుగా తెచ్చి కల్వకుంట్ల కుటుంబం లాభపడిందని, తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగలేదని పేర్కొన్నారు. జనగామ చేర్యాల ప్రాంత రైతుల కోసం తపస్ పల్లి కి దేవాదుల నీళ్లు తీసుకువస్తే గత ప్రభుత్వంలో తన అధికార బలంతో పక్క నియోజక వర్గానికి నీళ్లు మళ్లించిన వ్యక్తి హరీష్ రావు అని, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కబ్జాలతో ఈ ప్రాంత రైతు నోట్లో మట్టి కొట్టారని పేర్కొన్నారు. జనగామ ప్రాంత అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నియోజక వర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని,తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక, జనగామ ఎమ్మెల్యే ప్రజల బాగోగులు చూడకుండా తన సొంత యూనివర్సిటీని కాపాడుకోవడానికి పాకులాడుతున్నారని పేర్కొన్నారు.కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థాన డైరెక్టర్ విప్లవ్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు ఇజ్జగిరి రాములు,చల్లా సురేందర్ రెడ్డి, ఇజ్జగిరి శేఖర్,పరుశరాములు,గండి సురేష్,మసూద్,ఆరేళ్ల భాస్కర్,జంగిలి సామి, కనుకయ్య,ఆల్వాల ఎల్లయ్య,నిమ్మ కరుణాకర్ రెడ్డి,బందారం క్రాంతి, మట్టి బాలరాజు,గంగం బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు