
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 22
అల్లూరి సీతారామరాజు జిల్లా శుక్రవారం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జె ఎ సి చింతూరు డివిజన్ సమావేశం ఉపాధ్యక్షులు శీలం తమ్మయ్య అధ్యక్షతన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లోడివిజన్ చైర్మన్ జల్లి.నరేష్ మాట్లాడుతూగతం ఈ ప్రాంత పర్యటనకు వొచ్చిన సందర్భంలో మరియు ఎన్నికల సందర్భంలో సి ఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని, ప్రస్తుతం అల్లూరు జిల్లాలోని కొనసాగుతున్న రంపచోడవరం నియోజకవర్గాన్ని, పోలవరం ముంపు మండలాలను కలుపుతూ కారం తమ్మన్న దొర జిల్లాని ఏర్పాటు చేసి సీఎం హామీ నేర్వర్చాలని డిమాండ్ చేశారు. పరిపాలనా సౌలభ్యం లక్ష్యంగా జిల్లాల పునర్ విభజనను ఆదివాసీ సమాజం స్వాగతిస్తుందని, అనేక తరాలుగా పాలనా సౌలభ్యంతో పాటు ప్రత్యేక పాలనకోసం అనేక పోరాటాల చారిత్ర ఆదివాసీలదని గుర్తు చేస్తూ, రంపచోడవరం నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాలో మైదాన ప్రాంతంతో కలపవద్దని, ప్రతేక ఆదివాసీ చట్టల అమలు ఆదివాసీలకు పరిపాలనా సౌలభ్యం లక్ష్యం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రత్యేక జిల్లా చేయడమే సరైన పరిషకారం అని, రంపచోడవరం – రంప పితూరు చరిత్రకు ఆద్యుడు కారం తమ్మన్న దొర పేరిట రంపచోడవరం నియోజకవర్గాన్ని, పోలవరం ముంపు మండలాలను కలుపుతూ తూర్పు కనుమల ఆదివాసీలకు మరో ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాకా సీతరామయ్య పూనెం.శ్రీను సోయం రవికుమార్,రఘు,తునిక సత్యం,మడివి రాజు తదితరులు పాల్గొన్నారు.