* గ్రీనరీ పెంపు, గార్డెనింగ్ తో సరికొత్త రూపును సంతరించుకున్న కలెక్టరేట్
* జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో కలెక్టరేట్ లో పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 01. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పచ్చదనం పెంపుకు చర్యలు తీసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా గార్డెనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేక శ్రద్ధతో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ నందు పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటులో భాగంగా పూలు, అలంకరణ, వివిధ రకాల మొక్కలను నాటడం జరిగింది. కలెక్టరేట్ లోని ఫౌంటెన్ చుట్టూ, ఆవరణ చుట్టూరా అలంకరణ మొక్కలను నాటడంతో పాటు పూల మొక్కలను కుండీలలో కార్యాలయం ముందు భాగంలో ఉంచడం జరిగింది. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన గార్డెనింగ్ లో, పూల కుండీలలో కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా పోయిన్సెట్టియా రెడ్, మినీ ఇగ్సొర, టోపియరీ – ఫికస్ బ్లాక్, అరెకా పామ్, సైకస్, పెన్సిల్ పెయిన్, హేలికోనియా ఆరంజ్, కోలియస్ రెడ్, బ్లాకు ఏరాంతమం, దేనేలియ వేరిగేటేడ్, ట్యూబ్ రోజ్ -డబల్ ఫ్లవర్, ట్యూబ్ రోజ్ సింగిల్ ఫ్లవర్, లెమన్ గ్రాస్, క్రీపర్, ఆగ్లోనియ, చైనా బాక్స్, క్రైసాంతిమం, హైబ్రిడ్ రోజ్, రాయల్ పామ్, గోల్డెన్ దురంత, రాదర్ మాచెర వంటి రకాల దాదాపు 12 వేలకు పైగా మొక్కలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ భవనం మధ్యలో అందమైన ఆకృతిలో పచ్చిక పూల మొక్కలను ఫౌంటేన్ చుట్టూ అద్భుతంగా నాటడం జరిగింది. ఈ గార్డెన్ తో జిల్లా కలెక్టరేట్ సరికొత్త రూపును సంతరించుకుంది. సమీకృత జిల్లా కలెక్టరేట్ వద్ద గార్డెనింగ్ తో పాటు కలెక్టర్ ఛాంబర్ ప్రక్కన, ప్రవేశం దగ్గర, కార్యాలయాల వద్ద కుండీలలో మొక్కలను అధికారులు ఏర్పాటు చేశారు.