ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతరాం కర్ణ
పయనించే సూర్యుడు జనవరి 30 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
హసన్ పర్తి 66వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాల యందు స్వయం పరిపాలన దినోత్సవము మరియు పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశము పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ ఆకుతోట శాంతారామ్ కర్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 66వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ గురుమూర్తి శివకుమార్, అతిథులుగా నేతాజీ పాఠశాల కరస్పాండెంట్ వలస జ్ఞానేశ్వర్ రావు, మరియు రిటైర్డ్ టీచర్ బండ కాళిదాసు హాజరైనారు 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి వారి అనుభవాలను తమ ఉపన్యాసముల ద్వారా తెలిపినారు ఉపాధ్యాయ వృత్తి లోని సాధక బాధకాలను స్వయంగా ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకున్నామని ఉపాధ్యాయ వృత్తి ఎంతో మేధమోదనంతో తరగతి గదిలోని విద్యార్థుల స్థాయి కనుగుణంగా విద్యా బోధన చేస్తూ వారిలో ఉన్న నిగూఢమైన సృజనాత్మకతను వెలికి తీసి ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడతారు స్వయంగా తెలుసుకున్నామని తెలియజేసినారు తాము ఈ పాఠశాలలో 13 సంవత్సరముల నుండి చదువుకుంటూ ఈ పాఠశాలను వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉన్నదని మాకు విద్యాబుద్ధులు నేర్పి క్రమశిక్షణతో కూడిన విద్యను అందించిన గురువులను తోటి విద్యార్థులను ఎన్నటికీ మర్చిపోము అని జీవితంలో ఇంకా పై స్థాయికి ఎదగడానికి ఈ పదవ తరగతి తొలి మెట్టు అని మేమంతా కష్టపడి ఉపాధ్యాయులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవ తరగతిలో అత్యున్నత మార్కులు సంపాదించి పాఠశాలకు ఉపాధ్యాయులకు మా తల్లిదండ్రులకు పేరు తెస్తామని మాకు ఈ సుజాత విద్యానికేతన్ పాఠశాల దేవాలయం లాంటిదని ఈ దేవాలయము మా జీవిత గమ్యానికి బాటలు వేసిందని మాకు చదువుతోపాటు అనేక సహ పాఠ్యాంశాలను పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే విధంగా చెట్లు నాటడం మట్టి గణపతి విగ్రహముల తయారీ ఉచిత పంపిణీ జల సంరక్షణ కాలుష్య రహిత దీపావళి హోలీ పండుగలు డ్రాయింగ్ పెయింటింగ్ వ్యాసరచన ఉపన్యాస పోటీలలో జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలలో మమ్మల్ని నిలబెట్టిన మా పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారాం కర్ణకి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేసినారు అనంతరము ముఖ్య అతిథులుగా విచ్చేసిన 66వ డివిజన్ కార్పొరేటర్ శివ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క సందేశముల ద్వారా పాఠశాల యొక్క గొప్పతనం విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విషయంలో రాజీలేని కృషి చేస్తూ 42 సంవత్సరాలుగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్ది వారు జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టడం సామాన్యమైన విషయం కాదని అందుకు కృషి చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులను అభినందిస్తున్నామని తెలిపినారు అతిథులుగా విచ్చేసిన జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఇష్టంగా చదివి రాబోయే పదవ తరగతి పరీక్షలో అత్యున్నత మార్కులు సాధించి జిల్లా స్థాయిలో పాఠశాల పేరును ప్రథమ స్థానంలో నిలపాలని పదవ తరగతి తరువాత కళాశాల స్థాయిలో క్రమశిక్షణతో చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరినారు బండ కాళిదాసు రిటైర్డ్ టీచర్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలలో తప్పులు లేకుండా రాసి ఒక కాల పట్టిక పెట్టుకుని చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మీరందరూ మీ పాఠశాల జీవితాన్ని నెమరు వేసుకుంటూ మీరు పాఠశాలలో పొందిన అనుభూతిని అనుభవాలను తెలియజేయడం చాలా ఆనందం కలిగినదని ఉన్నత చదువులకు వెళ్తున్న మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలని టీవీలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకొని ఇంటర్మీడియట్ విద్య క్లిష్టమైనదని ఆ దశను దాటితే మీరు ఉన్నత విద్యలో పై స్థాయికి వెళతారని ఈ పాఠశాల స్థాపించిన మేడం ఊర్మిళాదేవి చిరస్మరణీరులని వారి అడుగుజాడలలో వారి కుమారులైన పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారాం కర్ణ ఈ పాఠశాలను విజయపథంలో నడిపించడం చాలా గర్వకారణమని కొద్ది సంవత్సరాల్లోనే ఈ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు ముస్తాబై అంగరంగ వైభవంగా విద్యా సదస్సులను నిర్వహించే విధంగా ఉండాలని ఆకాంక్షించినారు అనంతరము పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతరాం కర్ణ మాట్లాడుతూ అందరి సహకారంతో పాఠశాల నిర్వహిస్తూ నిరంతరం విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధిని ఆకాంక్షిస్తూ వారికి క్రమశిక్షణ సహ పాఠ్యాంశములు పర్యావరణహిత కార్యక్రమాలను బోధిస్తూ వారికి జీవన నైపుణ్యాలను నేర్పుతూ ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కృషి చేస్తూ ఉన్నామని ఇకముందు కూడా ఎక్కడా రాజీ పడకుండా నిరంతరం విద్యార్థుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలిపినారు తదనంతరం స్వయం పరిపాలన దినోత్సవంలో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు జూపాక నాగరాజు, వెంకట్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, అచ్యుత్ రెడ్డి, రాధాకుమారి,సబిహ,అరుణ, సుచిత్ర, జి సంధ్య, ఎస్ సంధ్య, ఎల్ సరిత,ప్రవళిక మౌనిక, దేవిక, భవాని, సుధారాణి,లావణ్య, గీత తదితరులు పాల్గొన్నారు