
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రావణి రెడ్డి
_పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 2, కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్
_
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకాలను తక్షణమే అమలు చేయాలని లేని.పక్షంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ) భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. నిజాముద్దీన్ కాలనీ యందు సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే అజయ్ బాబు ,ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి శ్రావణి రెడ్డి , సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు ,, మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి నిరుపేద కుటుంబానికి పట్టణంలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ.పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు నివాస గృహాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కూటమి ప్రభుత్వానికి వచ్చే పంచాయతీ ,కౌన్సిలర్, కార్పొరేట్ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సాయి పోగు కోటమ్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మి నారాయణ, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షులు బస్సాపురం లింగప్ప, సిపిఐ నాయకులు మన్సూర్, మహమ్మద్ భాష, సాబీర్ వలి తదితరులు పాల్గొన్నారు.