శేరిలింగంపల్లి,ఫిబ్రవరి 01 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవా లయంలో జరుగుతున్న బ్రహ్మోత్స వాల లో భాగంగా,స్వామి వారి ఊరేగింపు నిజాంపేట్ రోడ్డులో ప్రతి ఏడు జరిగినట్లే జరుపుటకు,నిజాంపేట్ రోడ్డు వద్ద చేపడు తున్న వరద కాలువ పనులు,ఊరేగింపు కు అడ్డు లేకుండా రొడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని జిహెచ్ ఎంసి ఇంజనీరిం గ్ ఏఈ రాజీవ్‌ని ఆదేశించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు.ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ,సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాల యంలో బ్రహ్మోత్సవాలలో జరుగుతున్న సందర్భంగా ఇఓ విజ్ఞప్తి మేరకు నిజాంపే ట్ రోడ్డు వద్ద చేపడుతున్న వరద కాలువ పనులు,ఊరేగింపుకు అడ్డు లేకుండా రొడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని జిహెచ్ఎంసి ఏఈకి చెప్పడం జరిగింది అని, అలానే పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకుమా దృష్టికి వచ్చిన సమ స్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో డివిజన్ లో అత్యవసరం ఉన్నచోట,నిత్యం సమస్య లతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్య తగా పను లు పూర్తి చేస్తామని,ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్ప కుండా పరిష్కరిస్తా మని,కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్యరహిత ఆదర్శ వంత మైన కాలనీలుగా తీర్చి దిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు.అ లానే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో
ఎక్కడ రాజిపడ కూడదని ప్రజలకు స్వచ్ఛమైన,చక్కటి ఆహ్లాదకర మైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది.పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని,అన్నివేళలా ప్రజలకు అందు బాటులోకి ఉంటానని,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని,అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంత మైన,అగ్రగామి డివిజన్‌గా తీర్చిదితామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎంసి ఏఈ రాజీవ్,వేంకటేశ్వర స్వామి ఇఓ సత్యనారాయణ కాలనీ వాసు లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సెవెన్ హిల్స్ వెంకటేశ్వరస్వామి బ్రహ్మో త్సవాలకు అడ్డుఅదుపు లేకుండా చేపట్టిన వరద కాలువ పనులను సత్వరంగా పూర్తి చేయాలి:నార్నే శ్రీనివాసరావు
RELATED ARTICLES