
సేవాలాల్ 286వ జయంతిలో గిరిజన సంఘం జిల్లా నాయకులు శ్రీను నాయక్
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 15 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ : సంత్ శ్రీ సేవాలాల్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని తెలంగాణ గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా నాయకులు గ్రామ సేవాలాల్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీను నాయక్ అన్నారు. ఫరూక్నగర్ మండలం లోని కడియల కుంట తండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరానికి సేవాలాల్ జీవిత చరిత్ర ఆదర్శమన్నారు కాబట్టి. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంలోకి చేర్చాలని ఆయన అన్నారు గిరిజన సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. అజ్ఞానంలో ఉన్న తోటి గిరిజనుల విజ్ఞానం వైపు నడిపించిన వ్యక్తి తండాలను శిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన వ్యక్తి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మద్యపానాన్ని సేవించకూడదు జంతుబలిని చేయకూడదు అని గిరిజనులకు సూచించిన వ్యక్తి సంత్ శ్రీ సేవాలాల్ అన్నారు ఈ కార్య క్రమంలో ఉపాధ్యాయులు శరత్ కుమార్ భాస్కర్ సుజాత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు