
ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగాలి
బూర్గుల లో టీ టైం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ వైస్ ఎంపీపీ
( పయనించే సూర్యుడు జూలై 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో క్రాంతి టిఫిన్ మరియు టీ టైం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కార్యక్రమంలో ఫరూక్నగర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యాపారంతోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ వ్యాపార రంగంలో రాణించాలని అన్నారు. అదేవిధంగా కష్టపడి ఎంచుకున్నా రంగంలో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పోచయ్య మాజీ డిప్యూటీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాచవరం వెంకటయ్య గౌడ్ ఎల్ సత్యనారాయణ గౌడ్, కృష్ణయ్య నర్సింలు భూపాల్ చక్కటి ప్రభాకర్ మరుగని రవి మరియు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
