
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పోనకంటి ఉపేందర్ రావు : టేకులపల్లిస్కూటో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ వెంకట రాజయ్యను గెలిపించాలని స్కూటో జేఏసీ జిల్లా కన్వీనర్ టిఆర్ సింగరేణి డిప్యూటీ మేనేజర్ సునీల్ కోరారు. ఈ సందర్భంగా గురువారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ టీచర్స్ ఆర్గనైజేషన్(స్కూటో) జేఏసీ ప్రకటించిందని, జేఏసీ ప్రతినిధులు జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ మురళి మనోహర్, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, ప్రొఫెసర్ గడ్డం మల్లేశం, రాజకీయ జేఏసీ కన్వీనర్ కోల జనార్ధన్ మద్దతుగా రావడం సంతోషంగా ఉందని అన్నారు. సేవ్ కాన్సిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నారాని తెలిపారు. అందులో భాగంగానే నాలుగు దశాబ్దాలుగా విద్యారంగా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు ఆయన ముందుకు వెళుతునన్నారని అన్నారు. ఉపాధ్యాయునిగా సామాజిక రాజకీయ ఉద్యమకారునిగా రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఉద్యమ నేపథ్యం ఉన్న మూడు జిల్లాల ఉపాధ్యాయులకు సుపరిచితుడుగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ వెంకట్ రాజయ్యకు నిలబడి ఒక్క అవకాశం ఇచ్చి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనమండలికి పంపిస్తే మీ పక్షాన పోరాటం చేస్తూ అనేక సమస్యలపై మండలిలో గళం విప్పుతానని తెలిపారు.