
ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్ గుడిసె ఆది కృష్ణమ్మ
పయనించే సూర్యుడు ప్రతినిధి బాలకృష్ణ (18: జనవరి) (ఆదోని నియోజకవర్గం)… “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛదివాస్” కార్యక్రమంలో భాగంగా ఆదోని మండలం లోని మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెత్త చెదారాన్ని శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ (ఇన్చార్జి) అజయ్ కుమార్ తహశీల్దార్ శివ రాముడు, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, రజికా కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, ఆదోని టిడిపి మాజీ ఇంచార్జ్ శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ, ఎంపీపీ పంపాపతి, బిజెపి నాయకులు విట్టా రమేష్, మధుసూదన్ శర్మ, మాజీ ఎంపీపీ మురళి, బాబురావు రవి, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.