
పయనించే సూర్యుడు జనవరి 18 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి… విశ్వవిఖ్యాత నటసర్వబౌమ నటరత్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి సందర్భంగా వివేకానంద నగర్ చౌరస్తాలో ఉన్న ఎన్ టి ఆర్ విగ్రహానికి గొట్టుముక్కుల పెద్ద భాస్కర్ రావు మరియు ఎర్రబెల్లి సతీష్ తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు రంగారావు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ప్రపంచంలో తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి అని బడుగు బలహీన వర్గాలకు మరియు యువతకి రాజకీయంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి అని పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి అనేక సంస్కరణలు పేదల గురించి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల ఆంజనేయులు, యశ్వంత్, రవీందర్రావు, శ్రీనివాస్ సాగర్, రామారావు, వాసు, జై, శ్రీనివాస్, సంతోష్, శ్రీరామ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.