
ఈ నెల 24 న జగిత్యాలలో సన్నాహక సమావేశం
రాయికల్ పట్టణం లోని స్థానిక వీ ఎస్ గార్డెన్ లో ఎం ఎస్ పి
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 16 మామిడిపెల్లి లక్ష్మణ్ జిల్లా అధ్యక్షులు దుమల గంగారాం స్థానిక మండల సమావేశం నిర్వహించారు ఇట్టి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అణగారిన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ సారథ్యంలో వేల గొంతులు లక్ష డప్పు లతో హైదరాబాద్ మహానగరంలో ఫిబ్రవరి 7 న భారీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి వేలాది గా తరలి వచ్చి విజయవంతం చేయడానికి ఈనెల 24న జగిత్యాల జిల్లా కేంద్రంలో సన్నాహక ప్రదర్శన సభ నిర్వహిస్తున్నామని ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంద కృష్ణమాదిగ రానున్నారని ప్రతి గ్రామం నుండి డప్పు కళాకారులు, మాదిగ మాదిగ ఉప కులాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ఉప అధ్యక్షులు బొనగిరి కిషన్ జిల్లా ప్రచార కార్యదర్శి కొల్లూరి సురేందర్ నియోజకవర్గ ఇంచార్చి పోడేటి సునీల్ మండల అధ్యక్షులు దోబ్బేల వేణు గోపాల్ మండల అధికార ప్రతినిధి పాలెపు సురేష్,మాజీ ఉప సర్పంచ్ భాపురపు నర్సయ్య సీనియర్ నాయకులు తలారి రాజేష్,ఉద్యోగ సంఘం నాయకులు బొల్లె చిన్నయ్య మాదిగ సంఘం లింగపల్లి రాజేష్ ,దులూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు