
ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరుగు లక్ష డప్పులు వెయ్యి గోతుకలు విజయవంతం చేద్దాం
*ఈనెల 29న గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు నారాయణపేట జిల్లాకు రాక
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జీర్గల్ నగేష్ మాదిగ**
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ మాదిగ
*మహాజన సూర్యుడు, పిడిత వర్గాల గొంతుక మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు
పయనించి సూర్యుడు న్యూస్ మక్తల్ జనవరి20 నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడుగం గ్రామంలో *ఈరోజు నేరడగం గ్రామంలో వారు మాట్లాడుతూ…
ఎస్సీ వర్గీకరణ కోసం సాగుతున్న పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించే ” *వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నేరడగం గ్రామం నుంచి ప్రతి ఒక్కరు డప్పుతో తరలిరావాలని పిలుపునిచ్చారు.
SC రిజర్వేషన్ లో ఎంతో వెనుకబడిన మాదిగలకు, ఇంకా ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనారు. ఇందుకోసం ఎస్సీ వర్గీకరణ డిమాండ్ తో మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటాన్ని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు నిర్వహించారని గుర్తు చేసారు. రాజ్యాంగ ధర్మాసరం నిర్ణయం మేరకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని భావిస్తున్న తరుణంలో కొన్ని శక్తులు అడ్డు పుల్ల వేస్తున్నాయన్నారు. వారి కుట్రలకు తిప్పి కొట్టేందుకు చేపట్టిన వెయ్యి గొంతులు లక్ష డప్పులు సంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఉందన్నారు. ఇది పిల్లల భవిష్యత్తు కోసం సాగించే పోరాటంఅని వర్గీకరణ సాధించుకునేందుకు ప్రతి ఒక్కరు డప్పుతో హైదరాబాదుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో . ఎమ్మార్పీఎస్ మండల నాయకులుమణిగిరి కృష్ణ మాదిగ. నంగి నరసింహ మాదిగ. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శ్రీనివాసులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బహదూర్.గ్రామ యువత డప్పు కళాకారులు..గుడిసె నాగప్ప మాదిగ. సుతారి అంజప్ప మాదిగ. కే శీను మాదిగ. కే బాలకృష్ణ మాదిగ. దేవర కురుమప్ప మాదిగ. జి కుర్మప్ప మాదిగ ఎం నారాయణ మాదిగ. జి మారెప్ప మాదిగ. టీ తాయప్ప మాదిగ. డి సాయప్ప మాదిగ. సుతారి బాలు మాదిగ. క్షిరలింగప్ప మాదిగ. తదితరులు పాల్గొన్నారు.