
అల్లూరి జిల్లా,దేవీపట్నం మండలం చిహెచ్.విద్యా సాగర్ జనవరి 18…. ఈ సందర్భంగా ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్,డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం,మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం పారా లీగల్ వాలంటీర్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…. అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,వై.రామ వరం మండల పరిధిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వద్ద ఈ రోజు ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు (రిపోర్టింగ్ టైమ్ ఉదయం 10.30 గంటలకు) నవోదయ ఎంట్రన్స్ పరీక్ష కోసం అని స్పష్టంగా ఎగ్జామ్ హాల్ టికెట్ లో వ్రాసి ఉంది.హాల్ టికెట్ లో ఉన్న అడ్రస్ ఆధారంగా వివిధ మండలాల పరిధిలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఉదయం ఎనిమిది గంటలకే ఎగ్జామ్ సెంటర్ కి చేరుకున్నారు.అయితే ఉదయం 11.00 గంటలకు నవోదయ ప్రవేశ పరీక్ష సెంటర్ ఇక్కడ కాదు.ఆంధ్ర ప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పి.ఎర్ర గొండలో అని సిబ్బంది తెలియజేయటంతో అక్కడ నుండి సుమారు ఐదు లేక ఆరు కిలమీటర్లు దూరంలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ వెళ్ళటానికి రవాణా సౌకర్యం లేక పోవటంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.నవోదయ ఎగ్జామ్ సెంటర్ గందరగోళానికి కారణం సంబంధిత అధికారులే కారణం అన్నారు.కావున భవిష్యత్ లో నవోదయ ఎగ్జామ్స్ కావచ్చు లేదా ఏకలవ్య ఎగ్జామ్స్ కావచ్చు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పక్క ప్లాన్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు డిమాండ్ చేశారు