బాధితులు వీణవంక మండల గ్రామస్తులు..
పయనించే సూర్యడు //జనవరి 29//హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
హుస్సేన్ సాగర్ అగ్నిప్రమాద భాధితులని పరామర్శించిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారతమాత మహా హారతి కార్యక్రమంలో టపాసులు పేలి ప్రమాదవశాత్తు మెరుపులు పడి బోట్లకు అంటుకున్న ఘటనలో హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల పరిధిలోని వల్భాపూర్ గ్రామానికి చెందిన ప్రణీత్, సునీల్ గాయపడగా వారిని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్, ఆసుపత్రిలో పరామర్శించారు. సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారి దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పారు. గాయపడిన కుటుంబాలకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని వారికి అండగా నిలుస్తానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.వారికీ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.