ధాన్యం సేకరణలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.

May 11, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు 11 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : బాల్కొండ నియవర్గంలో
రైతులు ఆందోళన చెందవద్దు రైతు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.- బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినటువంటి రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసింది.ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఒక్క నిజామాబాద్ జిల్లాలోని 5.10 లక్షల మెట్రిక్ టన్నులను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది.వరి వేస్తే ఉరే అన్న పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి దొంగ ధర్నాలు చేస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసిన దొంగ ధర్నాలకు రైతుల మద్దతు లేదు.మొలకెత్తిన వడ్లను కూడా కొన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక్క కిలో కడ్తా కూడా లేకుండా రైతుల నుండి ధాన్యాన్ని సేకరించడం జరిగింది.కడ్తాల పేరుతో రైతులను దోచుకొని దాచుకొని తిన్న చరిత్ర బిఆర్ఎస్ పార్టీని ఆ నాయకులది. ఆనాడు మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డికి రైతుల చెమట చుక్కలే ఆదాయ వనరుగా ఉండేది రైతులు ఎవరు ఈ మోసపూరిత నాయకులు ఉచ్చులో పడొద్దు. గత నాలుగు పర్యాయాలు వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ పారదర్శకతకు మీరే సాక్షులు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపట్ల చిత్తశుద్ధితో ఉన్నది. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వరి ధాన్యం కొనుగోలు అష్ట కష్టాలు పడ్డ విషయాన్ని మా రైతులెవరు మర్చిపోలేరు, ధాన్యం సేకరించిన తరువాత డబ్బులకోసం రైతులు కళ్ళు కాయలు కాచేల ఎదురుచూసేవారు. కానీ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో రైతు నుండి ధాన్యం సేకరించిన 48 గంటలు లోపల వారి ఖాతాలో ధాన్యం తాలూకు డబ్బులు జమవుతున్నాయి. ప్రశాంత్ రెడ్డికి బుద్ధి ఉంటే ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించరు.కేవలం వరి పంటనే కాదు మొక్కజొన్న,జొన్న సోయాబీన్ వంటి పంతలను ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేస్తుంది.మొక్కజొన్న కొనుగోలు విషయంలో జిల్లాలో అత్యధికంగా బాల్కొండ నియోజకవర్గంలో 15 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఏర్పాటు చేయించడం జరిగింది.ప్రశాంత్ రెడ్డి పుణ్యమా అని బిఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో జిల్లాలో ఉన్న 75 రైస్ మిల్లులో 23 రైస్ మిల్లులు డిఫాల్ట్ గా మిగిలిపోయాయి ఇప్పుడు అవి ధాన్యాన్ని సేకరించి అర్హతను కోల్పోయాయి. అప్పటి ప్రభుత్వ నాయకులు జిల్లాలో మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి రైస్ మిల్లర్ లతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలులో అవకతవకలు చేశారు. దానివల్లే ఈ 23 రైస్ మిల్లులు ధాన్యం సేకరణ కు అర్హతను కోల్పోయాయి.సొసైటీలను నిర్వీర్యం చేసి రైతులను దోచుకున్న ప్రశాంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించే కనీస అర్హత కూడా లేదు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడిదాకైనా వెళ్లే పరిస్థితిలో ఉన్నారు రైతులు రాజును చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లక్ష్యంగా ముందుకు సాగుతున్నది ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఇబ్బందులను దానికి గల కారణాలను రైతులు గమనించాలి ప్రతిపక్షాలకు ప్రశాంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

📰 ePaper