మైనర్ బాలికపై అత్యాచారంకు పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి కుమారుడు బండి సాయిభగిరథ్ ను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి
పయనించే సూర్యుడు 12 5 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ ; .- అమ్మాయిలపై అకృత్యాలకు తనకుమారుడిని ప్రోత్సహిస్తున్న బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలి..- పీవోడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పి రమ డిమాండ్ మైనర్ బాలికపై అత్యాచారంకు పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి కుమారుడు బండి సాయిభగిరథ్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అమ్మాయిలపై అకృత్యాలకు తనకుమారుడిని ప్రోత్సహిస్తున్న బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలనిప్రగతి శీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పి రమ డిమాండ్ చేశారుసిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మంగళవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రగతి శీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పి రమ మాట్లాడుతు :కేంద్రం లో ఉన్న బిజెపి ప్రభుత్వంను చూసుకొని మహిళాలపై అకృత్యాల చేస్తున్నారు అని, అత్యాచారాలు, హింస పెరిగి పోయింది అన్నారు.కేంద్ర మంత్రి అయి ఉండి ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆ సంఘటనను మసిబూసి మారేడు కాయ చేయడం సిగ్గుచేటు అన్నారు.కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ భాధితురాలికి అండగా ఉండాల్సింది పోయి బెదిరించడం, కేసును తారుమారు చేయడం కోసం చూడడం సిగ్గుచేటు అన్నారు.ఒప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భాధితురాలికి అండగా ఉండి, మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన బండి సాయిభగత్ ను కాలయాపన లేకుండా అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలి అని, బండి సంజయ్ తన కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామ చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు.కార్యక్రమం లో ప్రగతి శీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) సిరికొండ సంయుక్త మండల కమిటీ అధ్యక్షురాలు ఇ జెమున, గ్రామ, మండల నాయకులు ఎస్ గంగామణి,ఏ సావిత్రి, ఎస్ బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు