నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులను సత్కరించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్..
( పయనించే సూర్యుడు మే 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ నియోజకవర్గ మున్సిపాలిటీ, మండల అధ్యక్షులుగా ఎన్నికైన నాయకులను మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ ఘనంగా సన్మానించారు. కొత్త అధ్యక్షులతో షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంత ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. షాద్నగర్ మున్సిపాలిటీ మండల అధ్యక్షుడు నలమోని శ్రీధర్, కొత్తూరు మున్సిపాలిటీ అధ్యక్షుడు సుదర్శన్ సుదర్శన్ గౌడ్, ఫరూక్ నగర్ మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, కొందుర్గు మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, చౌదరిగుడా మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, కొత్తూరు మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, నందిగామ మండల అధ్యక్షుడు కుమారస్వామి, కేశంపేట మండల అధ్యక్షుడు రమేష్ లను ఆయన సత్కరించారు. అధ్యక్షులుగా ఎన్నికైన వారందరికీ అభినందనలు తెలిపారు..