అశ్వాపురం గ్రామ పంచాయతీ సమస్యలపై ఏం ఎల్ ఏ పాయం కి మేమోరండం
…… మెమొరాండం ఇచ్చిన సర్పంచ్ బానోత్ సదర్ లాల్
పయనించే సూర్యుడు, జూన్ 06,అశ్వాపురం: శనివారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ కలిసి అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి వద్ద డివైడర్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయినందున త్వరితగతిన పనులు పూర్తిచేయాలని మరియు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని విన్నవించడం జరిగింది. పినపాక నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం భద్రాచలం కాగిత మిల్లు, భారజల కర్మాగారం, సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్, మణుగూరు బొగ్గు గనులు, భద్రాద్రి పవర్ ప్లాంట్ లకు అనుసంధానంగా ఉండటం వలనరోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ భారీ వాహనాల్లో వచ్చే హెవీ మిషనరీలు,ఇతర వాహనములు మరియు వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల వైపు వెళ్లే బస్సులు, కార్లు,ఇతర వాహనాలు వీటన్నిటి మూలాన రద్దీ పెరిగి ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం జరగటం పరిపాటి అయ్యింది అని, హెవీ వాటర్ ప్లాంట్ కు వెళ్ళే దారి నుండి చింతిర్యాల క్రాస్ రోడ్డు వరకు. రోడ్డు వెడల్పు చేసి డివైడర్ల నిర్మాణం ఏర్పాటు చేయించి లైటింగ్ ఏర్పాటు చేయాలని, వారం రోజుల క్రితం అశ్వాపురంఆర్ అండ్ బి ఆఫీస్ ఎదురుగా డివైడర్ కు ఢీ కొట్టిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు అని సుజాత నగర్,జూలూరుపాడు, ఎన్కూర్ మండలాల హెడ్ క్వార్టర్ లలో సుమారు మూడు కిలోమీటర్ల డివైడర్లు ఏర్పాటు చేశారు అని ప్రతిరోజు భారజలకర్మాగారానికి షిఫ్ట్ లో బస్సుల్లో,కార్లలో, ద్విచక్రవాహనాల, సైకిళ్లపైన రేయి పగలు అదికారులు, కార్మికులు, కాంట్రాక్ట్ లేబర్, దినసరి కార్మికులు వెళ్తుంటారు అని చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలు చాలా జరిగినవి అని, కావున ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.