ప్రభుత్వ బడులు ప్రతిభకు నిలయాలు* తపస్ బడిబాట పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ *ప్రియాంక
పయినించే స్యురుడు జూన్ 7:నారాయణపేట.జిల్లా కలెక్టర్ ప్రియాంక కు చేత శనివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రభుత్వ బడిబాటభవితకు బంగారు బాట పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు నరసింహ అధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల నాణ్యతను కిందిస్థాయిలో అందరికీ అవగాహన కల్పించి, ప్రభుత్వ బడుల్లో నూతన ప్రవేశాలను పెంచాలని తెలియజేశారు. విద్యా రంగ అభివృద్ధి, ప్రభుత్వ బడుల బలోపేతం, విద్యార్థుల ప్రతిభ ప్రోత్సాహం లక్ష్యంగా రూపొందించిన బడిబాట పోస్టర్ ఎంతో అభినందినీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన, ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ టీవీ తరగతులు, ఇంగ్లీష్ మీడియం విద్యా విస్తరణ, నో బ్యాగ్ డే వంటి కార్యక్రమాల అమలుతో విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయని ఆమె పేర్కొన్నారు. తపస్ అదనపు ప్రధాన కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ గుంపు బాలరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో ప్రవేశాలు పెంచడం, ప్రభుత్వ బడుల పటిష్టత కోసం కృషి చేయడం ఈ కార్యక్రమం ప్రధానలక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, జిల్లా నాయకులు సీతారాములు తిరుపతయ్య శ్రీనాథ్ మహిళా విభాగం నర్మద,సౌభాగ్య లక్ష్మి వెంకటమ్మ కృష్ణవేణి ప్రియాంక మండల నాయకులు చిన్న నరసింహులు వెంకటేష్ వాజ్పాయ్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ నారాయణపేట