
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 3 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలోని ఆదురుపల్లి కూడలిలో పారిశుద్ధ్య సమస్యను గమనించిన ఎస్సై తిరుమలరావు వెంటనే స్పందించారు.గ్రామంలో చెత్త మరియు చోరీలు సమస్యపై ప్రజలు అసంతృప్తిగా ఉండగా, ఎస్సై ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు.పరిస్థితిని మెరుగుపరిచేందుకు,గ్రామ పంచాయతీ కార్యదర్శి రామయ్యను ఫోన్ ద్వారా సంప్రదించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై కార్యదర్శి స్పందించి, పారిశుద్ధ్య నియమాలను మరియు చోరీలను అరికట్టేందుకు పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ స్థానికులకు నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో, ఫిబ్రవరి 5న ఉదయం 11 గంటలకు గ్రామ సచివాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో పారిశుద్ధ్య ప్రాముఖ్యత,ఆరోగ్యంపై దాని ప్రభావం, ప్రభుత్వ నిబంధనల గురించి మరియు చొరీలను అరికట్టే విధానం ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.ఎస్సై తిరుమలరావు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవడంతో,గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయనున్న తీసుకున్న ఈ నిర్ణయం గ్రామాభివృద్ధికి దోహదపడనుంది.