గాజా ప్రజల పై ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా అక్టోబర్ 7 న ఇల్లందులో జరుగుతున్న ప్రదర్శనను జయప్రదంచేయండి
నోముల భానుచందర్ పి వై ఎల్ రాష్ట్రసహాయ కార్యదర్శి
పయనించే సూర్యుడు అక్టోబర్ 6 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :గాజా పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్నా జాతి హననానికి వ్యతిరేకంగా రేపు 7 న ఇల్లందు పట్టణం లో జరిగే పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన ను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం PYL తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ యువత ను కోరారు. ఈరోజు జరిగిన ముఖ్యుల సమావేశం లో ఆయన పాల్గొన్ని మాట్లాడుతు పాలస్తీనా దేశం తమ ప్రజల స్వతంత్రంగా ఏర్పాటు చేసుకున్నా పాలకులను, ఇజ్రాయిల్, అమెరికా హమాస్ ను ఉగ్రవాద సంస్థగా అభివర్ణిస్తున్నాయి. పాలస్తీనా ప్రజల సార్వభౌమత్వాని కాలరాస్తు హమస్ ను అంతం చేసి, శాంతి స్వరాజ్యన్ని స్ధాపించాడం కోసమే ఈ యుద్ధం అని ఇజ్రాయిల్ తిర్మానిస్తుంది. పాలస్తీనా అధారిటీ, మాస్ లాంటి ఉగ్రవాద సంస్థ ప్రమేయం లేని శాంతియుత పరిపాలాన ను అందిస్తామన్న ఇజ్రాయిల్ చర్యలను అని దేశాలు తప్పు పడుతున్నాయి. భద్రత మండలి లో అమెరికా తీరును, నేతన్యాహు నిర్ణయాన్ని సభ్యదేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా ఇజ్రాయిల్, అమెరికా అండతో దాడులు కొనసాగిస్తుంది. ఇప్పటికైనా గాజా ప్రజలపై దాడులు ఆపి వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా ను విడిచిపెట్టి వెళ్లాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు కొడేం. రవి, తోటకూరి. సతీష్, సమ్మయ్య, జార్జి, రామ, గవాస్కర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.