
పయనించే సూర్యుడు జనవరి 21 బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నకు వడ్లను గోటితో వలసు (గోటి తలంబ్రాలు) కార్యక్రమంను ధర్మజాగరణ సమితి వారి ఆధ్వర్యంలో సోమవారం 20-1-2024 పుష్యమాసం కృష్ణపక్షం షష్టి తిధి సందర్భంగా భద్రాచలం నందు ఒడ్లను స్వామివారి పాదముల చెంత ఉంచి పూజ చేసి రాములోరి పెళ్లి కొరకు గోటి తలంబ్రాలు ఒలుచుట శ్రీకారం చుట్టినారు.
చర్ల ,ఆర్ కొత్తగూడెం, దుమ్మగూడెం, ధర్మ జాగరణ సమితి సభ్యులు, భక్తులు ఒడ్లను తీసుకుని వచ్చి స్వామి పాదాల చెంత పెట్టి పూజలు నిర్వహించినారు. అనంతరము చుట్టుపక్కల గ్రామాల్లో గల ఆలయ కేంద్రంగా శ్రీరామ నామము చెప్పుతూ చేతి గోటితో వలచి తలంబ్రాలుగా చేసే ప్రక్రియను ప్రారంభించారు ,ఈ భగవత్ కార్యక్రమంనుశ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకులు రాం స్వరూప్ , సూపర్డెంట్ కత్తి శ్రీనివాస్ దగ్గరుండి పూజా కార్యక్రమాలు నిర్వహించినారు ఇస్కాన్ శ్రీ మాన్ ప్రణవానంద ప్రభు రాములోరి పెళ్లి కొరకు ఒడ్లను వలచి తలంబ్రాలుగా చేసే ప్రక్రియ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ధర్మజాగరణ సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహా ప్రముఖ్ ఎం. వి .సుబ్రహ్మణ్యం . భక్తులు
మచ్చ వీర్రాజు,
డి .సత్యనారాయణ రెడ్డి, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.