
అశ్వారావుపేట టౌన్, జనవరి 21:… మంచిరోగ్యం పోషకాహారంతో పాటు పరిసరాల పరిశుభ్రతతో సాధ్యమవుతుందని అశ్వారావుపేట పిహెచ్సి వైద్యులు డా. రామదాసు తెలిపారు. వంద రోజుల టిబి నీక్షయ్ శివర్ పోగ్రోమ్లో భాగంగా దమ్మపేట టియూ ఆధ్వర్యంతో అశ్వారావుపేట సబ్సెంటర్ 2 పరిదిలో టిబి పై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ టి బి లక్షణాలు ఉంటే వెంటనే మందులు వాడాలని అందుకు ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో మందులు అందుబాటులో ఉంచటం జరిగిందన్నారు. అనంతరం కేంద్రపు ఎంఎలౌచ్ పి స్రవంతి మాట్లాడుతూ Aటి నిర్ధారణ అయిన తరువాత సరైన పద్దతుల్లో మంచి పోషకాహారాన్ని తీసుకోవాలని తగు జాగ్రత్తలు పాటించటం ద్వారా టిబి వ్యాధిని దూరం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది దుర్గ, బేబి, ప్రసాద్, రిజ్వాన్, సుజాత తదితరులు పాల్గొన్నారు.