
పయనించే సూర్యుడు న్యూస్ చివ్వెంల మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి 29:- సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ఉపాధి హామీ ఉద్యోగులకు పేస్కేల్ ఇవ్వాలని మరియు మూడు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంపీడీవో కి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఉపాధి హామీ ఉద్యోగులు ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రాష్ట్ర జేఏసీ డిమాండ్ చేసింది ఏ మేరకు బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో చివ్వెంల మండలంలో ఎంపీడీవో కు పత్రాన్ని సమర్పించారు ఈ పథకం కింద పని చేస్తున్న ఉద్యోగులకు పేస్కేలు వర్తింపచేయాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే పరిష్కారం చూపాలని కోరారు కుటుంబాలు నిత్యం సరుకులు కొనడానికి గాని రోజువారి విధులకు హాజరు కావడానికి బండిలో పెట్రోల్కు బస్సు కిరాయిలకు పైసలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం పాల బిల్లు కూరగాయలు ఇంటి అద్దె పిల్లల చదువులకు ఫీజులు బ్యాంకులో తీసుకున్నారు ఈ యంఐ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. రోజువారి ఖర్చులకోసం స్నేహితులు బంధువుల దగ్గర సేబదులు తీసుకొని వారికి ఇవ్వలేకపోతున్నాము పైసలు బదులు అడిగితే ఎక్కడ కూడా మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి,శాఖ మంత్రి జీతాలు ఇచ్చేటట్లు తగిన చోరవ తీసుకోవాలని కోరుతున్నారు ఉపాధి హామీ ఉద్యోగులు.