పోస్టర్‌ను విడుదల ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు.
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 2, ఆదోని టౌన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి
సాయి ప్రసాద్ రెడ్డి మీడియతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.* ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను పూర్తిగా నిలిపివేసింది. కళాశాల యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోవడంతో విద్యార్థులను తరగతులకు అనుమతించడం లేదు. ముఖ్యంగా పేద కుటుంబాల విద్యార్థులు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది.* ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దుతో వేలాది విద్యార్థులు చదువు మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి.* ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వ బాధ్యతా రాహిత్యంతో విద్యార్థులను తరగతులకు అనుమతించడంలేదు. టీడీపీ నాయకులు ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించి లక్షలాది రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు.* విద్యార్థుల హక్కులను కాపాడే ఉద్దేశంతో ఫిబ్రవరి 5న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌ల ముందు “ఫీజు పోరు” విద్యాదీవెన కింద రూ.2,800 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. వసతిదీవెన కింద రూ.1,100 కోట్ల బకాయిలను చెల్లించాలి. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను తరగతులకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్ధుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలి డిమాండ్ లతో ఉద్యమం నిర్వహించనున్నాం.కార్యక్రమంలోగౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి,విద్యార్థి భాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్, ఆదోని విద్యార్థి అధ్యక్షులు ఇసాక్, ఉమేష్, కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి, బాలాజీ, చలపతి, ముంబతి స్వామి, రామలింగేశ్వర యాదవ్, అయ్యప్ప పరగల నారాయణ ఎరుకుల రమేష్ సర్పంచ్ రామంజి, తదితరులు పాల్గొన్నారు.