పయనించే సూర్యడు //ఫిబ్రవరి 2// హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను కలవడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలో కుల గణన నివేదిక రాబోతున్న సందర్భంగా,నిన్న ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ని కలిసి మాల మాదిగలతో కలపకుండా,బేడ బుడగ జంగాల ఉపకులాలుగా చేర్చి 5 శాతం రిజర్వేషన్ కేటాయించాల్సిందిగా వారిని కోరడం జరిగిందన్నారు . అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో ఎన్టీఆర్ నగర్లో నివసిస్తున్న వానరాశి ఉప్పలయ్య కుమార్తె హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. తన భర్త చనిపోయారు. వారికి నలుగురు ఆడపిల్లలు మొన్న జరిగిన బదిలీలలో భూపాలపల్లి జిల్లాకు తనను ట్రాన్స్ఫర్ చేసినారు. మంచిర్యాల నుండి భూపాలపల్లికి రావడం పోవడం దాదాపు 220 కిలోమీటర్లు కనుక రావడం పోవడం తనకు తన పిల్లలకు ఇబ్బంది అవుతుంది,అని వారిని తిరిగి మంచిర్యాల లేదా రామగుండం కమిషనర్ రేటుకు బదిలీ చేయాల్సిందిగా వారిని కోరడం జరిగిందన్నారు . ఈ రెండు విషయాలపైన మంత్రి సానుకూలంగా స్పందించినందుకు వారికి బేడ బుడగ జంగం జన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం జన సంఘం,రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు తో పాటు . జాన్ సెక్రెటరీ కళ్లెం ముత్తు. తదితరులు పాల్గొన్నారు.
ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన బేడ బుడగ జంగాల నాయకులు..
RELATED ARTICLES