పుట్ట రవి మాదిగ
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
ఈరోజు హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాజారపు బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో ఎంఎస్పి పార్టీ రాష్ట్ర నాయకులు పుట్ట రవి మాదిగ పాల్గొని మాట్లాడుతూ హైదరాబాదులో జరగబోవు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అమలుకై లక్షల డబ్బులు వేల గొంతులు మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ ప్రారంభం ఉదయం 11 గంటలకు హైదరాబాదులో జరగబోవు సదస్సుకు పద్మశ్రీ పురస్కార్ అవార్డు గ్రహీత,సబ్బండ కులాల స్ఫూర్తి దాత మందకృష్ణ మాదిగ నిర్వహించబోయే ర్యాలీ ప్రదర్శనకు జిల్లాలోని ప్రతి ఇంటి నుండి డప్పు సంకనేసుకుని రావాలని పిలుపునివ్వడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ న్యాయమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది దీనిని గ్రహించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులైన ఎమ్మెల్యేలు వర్గీకరణకు అడ్డుపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆపడం జరుగుతుందని అన్నారు దానికి ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి తొలంగి జాప్యం చేయడాని నిరసిస్తూ ఈనెల ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం పైన తాడోపేడో తేల్చుకుందామనిఈదేశంలో ఉన్నటువంటి కులసంఘాలను ప్రజాసంఘాలను మేధావులను విద్యార్థులను సాంస్కృతిక కళాకారులను రచయితలను మాదిగల గుండెచప్పులను వినిపించడానికి అందరూ రావాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు ఆరె పెళ్లి పవన్,అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు నమిండ్ల రవీందర్ మాదిగ, మేకల రమేష్ మాదిగ,మాజీ మండల అధ్యక్షులు రేణు కుంట్ల దుర్గాప్రసాద్ మాదిగ, నమిండ్ల సూర్యం మాదిగ, మట్టెడ సాంబయ్య మాదిగ, రత్నం మాదిగ,ఎల్తూరి సురేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు