
ఢిల్లీ : ఎన్డీయే భాగస్వామిగా బిజెపి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఢిల్లీ విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎంపి కేశినేని శివనాథ్ ఘనస్వాగతం పలికారు. పయనించే సూర్యుడు జనవరి 3 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. ఆదివారం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపి గంటి హరీష్ మాధుర్ బాలయోగి, బస్తిపాటి నాగరాజు, రాజ్యసభ ఎంపి సానా సతీష్ లతో కలిసి ఢిల్లీ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) స్వాగతం పలికారు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు బిజెపి అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు.