
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 03 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
కేశంపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలోని విఐపి పబ్లిక్ స్కూల్లో మాఘ శుద్ధ పంచమి సరస్వతీ మాత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విఐపి హైస్కూల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు విద్యార్థులందరిచే సరస్వతి మాత ప్రార్ధన,అష్టోత్తర శతనామాలు పలికిస్తూ ఉత్తమ విద్యా ప్రాప్తి కోసం సంకల్పం చేయించారు. ఓం శ్రీ సరస్వత్యై నమః అంటూ నూతన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకట్ కృష్ణ నరేష్ మరియు ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.