
-రెండు వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
5 గురి వ్యక్తులపై కేసులు నమోదు
ములుగు జిల్లా(నూగురు) వెంకటాపురం మండలం బెస్తగూడెం అటవీ ప్రాంతంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కె. తిరుపతి రావు, సి ఆర్పీ ఏప్, సిబ్బంది సోమవారం ఉదయం కార్టన్ అండ్ సర్చ్ తనిఖీలో లో భాగంగా గుడుంబా స్థావారాలపై దాడులు నిర్వయించారు ఆ ప్రాంతంలో ఉన్న రెండు వేల లీటర్ల పానకం ధ్వంసం చేసారు పోలీస్ దాడులను ముందే పసిగట్టిన గుడుంబా వ్యాపారులు అడువుల్లోకి పరుగులు తీశారు ఈ సందర్బంగా వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కె. తిరుపతిరావు మాట్లాడుతూ గుడుంబా వ్యాపారాలు చేస్తున్న ఐదు గురి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు గుడుంబా, గంజాయి వంటి నిషేదిత తయారీ విక్రయాలపై పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు అలాగే అసాంఘిక శక్తుల పట్ల, సైబర్ నేరగాన్ల పట్ల అపర మత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమం లో సివిల్, సి ఆర్పీ ఏప్ సిబ్బంది పాల్గొన్నారు