Monday, March 17, 2025
HomeUncategorizedవామ్మో.. విషంతో సమానం.. ఉప్పు ముప్పు గురించి WHO మరో అలర్ట్..

వామ్మో.. విషంతో సమానం.. ఉప్పు ముప్పు గురించి WHO మరో అలర్ట్..

Listen to this article

పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 4:- రిపోర్టర్ (షేక్ కరిముల్లా )

ఉప్పు పెను ముప్పుగా మారుతోంది.. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపరంగా చాలా సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు.. ఉప్పు అధికంగా తినడం వల్ల హైబీపీ, గుండె జబ్బుల నుంచి చర్మ సమస్యల వరకు ఎన్నో జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

సోడియం ఉప్పును తక్కువగా తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. ఆహారంలో సాధారణ టేబుల్ సాల్ట్ కాకుండా పొటాషియం ఉన్న తక్కువ సోడియం సాల్ట్ వాడాలని చెబుతోంది. ఈ సిఫార్సు పెద్దలు, ఆరోగ్యకరమైన వ్యక్తుల కోసం మాత్రమేనని.. గర్భిణులు, పిల్లలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు సాధారణ ఉప్పునే తినాలని సూచించింది.

ఉప్పు ఎక్కువ గాని, తక్కువ గాని వాడకూడదు. ఇలా చేస్తే.. లోబీపీ.. హైబీపీ (బ్లడ్ ప్రెజర్) సమస్యను ఎదుర్కొవాల్సి ఉంటుంది.. ఇది సమతుల్య పరిమాణంలో తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల ఉప్పు తినాలి..

కానీ భారతీయులు సగటున రోజుకు 10 గ్రాముల ఉప్పు తింటారు. అదనపు ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది.. ఇది అనేక శారీరక సమస్యలను కలిగిస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులను పాటించాలని భారత ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలు భారతీయులకు మరింత ఉపయోగకరంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

భారతీయులకు ఉప్పు విడిగా తినే అలవాటు ఉంది. భారతీయులు చాలామంది తినే ముందు ఉప్పు డబ్బాతో టేబుల్ వద్ద కూర్చుంటారు.. సరిపోలేదంటూ ఆహారంలో ఉప్పు చల్లుకుని.. ఎక్కువగా తింటారు.. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం భారతీయులకు ముఖ్యమైనదని.. ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ‘విషం’..

ఎక్కువ ఉప్పు తినడం మొత్తం ఆరోగ్యానికి విషం తినడంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు తినడం వల్ల రక్తపోటు వేగంగా పెరుగుతుంది. ఇది గుండెపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

అంతే కాకుండా ఉప్పును ఎక్కువగా వాడటం వల్ల వ్యక్తి కిడ్నీలు, కాలేయం, రక్తం కూడా ప్రభావితమవుతాయి. అదనపు ఉప్పు తీసుకోవడం వల్ల సిరల్లో నీటి పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించాలి.

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు

– రక్తపోటు పెరుగుతుంది
– గుండె జబ్బులు
– ఎముకలు బలహీనపడటం
– కడుపు సమస్యలు
– మూత్రపిండాల వ్యాధులు
– బరువు పెరుగుట
– డీహైడ్రేషన్..
– చర్మ సమస్యలు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments