
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 4:- రిపోర్టర్ (వి చెంచయ్య)
: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సోమవారం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 11వ వార్డు పరిధిలో చెరువుముందర కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకం చేశారు. గ్రామస్తులు, ఆలయ అర్చకులు ఎమ్మెల్యే ని పూలమాలతో ఘనంగా సత్కరించి, ఆశీర్వచనాలు అందించారు.ఈకార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్,JSP దయారాం,గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ సురేష్ ,స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పలమనేరు రోడ్డులో హంగ్రీ బోర్డ్ రెస్టారెంట్, మురకంబట్టులో డీఐ మ్యాక్స్ థియేటర్ & పార్టీ జోన్లు ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.